
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ గురువారం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ విజయ్ రామప్ప చరిత్ర, శిల్పకళలపై వివరించారు.
ఆమె మాట్లాడుతూ.. రామప్ప టెంపుల్ ఎక్సలెంట్ అని, శిల్పకళ నైపుణ్యం సూపర్ అని ప్రశంసించారు. అనంతరం రామప్ప లేక్ లో బోటింగ్ చేశారు. ఆమె వెంట ఆర్డీవో వెంకటేశ్, ఉమ్మడి వరంగల్ జిల్లా టూరిజం అధికారి శివాజీ, ఎస్ఐ సతీశ్ ఉన్నారు.